Gold Rate: ఇంట్లో పాత బంగారం ఉందా...అయితే గుడ్ న్యూస్ మీ కోసం...ఇకపై రూ. 1 లక్ష విలువైన బంగారానికి ఎంత లోన్ లభిస్తుందో తెలిస్తే పండగే..?

ఇంట్లో పాత బంగారం ఉందా అయితే ఇది మీకు బిజినెస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్బిఐ తాజాగా మార్చిన రూల్స్ ప్రకారం మీరు బంగారంపై తీసుకునే లోన్ మొత్తం పెరగనుంది. గతంలో ఒక లక్ష రూపాయల విలువైన బంగారానికి కేవలం రూ. 60,000 మాత్రమే లోన్ లభించేది. ప్రస్తుతం ఈ మొత్తాన్ని 85 వేల రూపాయల వరకు పెంచారు. ఈ నేపథ్యంలో మీరు బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకునే వారికి ఇది ఒక రకంగా ఊరట అని చెప్పవచ్చు.

Gold

Gold

Photo : Times Now
ఇటీవల బంగారు ఆభరణాల రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ అందుబాటులోకి తెచ్చింది. ఇకపై రూ. 2.50 లక్షల వరకు బంగారు రుణాలపై లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తిని రిజర్వ్ బ్యాంక్ 75% నుండి 85%కి పెంచింది. అంటే ఇప్పుడు రూ. 1 లక్ష విలువ గల బంగారంపై రూ. 85,000 వరకు రుణం పొందవచ్చు, గతంలో ఈ పరిమితి రూ. 75,000 వరకూ మాత్రమే ఉండేది. అలాగే రూ. 2.5 లక్షల వరకు చిన్న బంగారు రుణాలకు క్రెడిట్ అప్రైసల్ అవసరం ఉండదు. అంటే తక్కువ డాక్యుమెంట్ వర్క్ ఉండటంతో పాటు, రుణ పంపిణీ వేగంగా ఉంటుంది. ఇది చిన్న రుణగ్రహీతలకు, ముఖ్యంగా గ్రామీణ చిన్న పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి రుణం పొందడం సులభతరం చేస్తుంది. మరోవైపు, రూ.2.5 నుండి 5 లక్షల బంగారు రుణాలపై LTV 80% ఉంటుంది. రూ.5 లక్షల కంటే ఎక్కువ రుణాలపై LTV 75% వద్ద ఉంచారు. రూ.2.5 లక్షల కంటే ఎక్కువ రుణాలపై క్రెడిట్ అప్రైసల్ తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం బంగారం రుణాలపై బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లు ఇవే..
SBI – 8.55% - 10.25%
HDFC బ్యాంక్ – 9.30% - 17.86%
యాక్సిస్ బ్యాంక్ – 17% నుంచి ప్రారంభం
కెనరా బ్యాంక్ – 9.25%
బ్యాంక్ ఆఫ్ బరోడా – 9.15% నుంచి ప్రారంభం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 9.25%
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 8.40% - 9.50%
ఫెడరల్ బ్యాంక్ – 8.99% నుంచి ప్రారంభం
ఇండియన్ బ్యాంక్ – 8.65% - 10.40%
ఇండస్ఇండ్ బ్యాంక్ – 9.60% - 16.00%
బజాజ్ ఫిన్‌సర్వ్ – 12.99% నుంచి ప్రారంభం
ముత్తూట్ ఫైనాన్స్ – 12% - 27%
మణప్పురం ఫైనాన్స్ – 14% - 29%
ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి గోల్డ్ లోన్స్ అందిస్తున్న బ్యాంకుల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి తక్కువ వడ్డీరేట్లకే బంగారం రుణాలను ఆఫర్ చేస్తోంది. మార్కెట్లో ఉన్న ఇతర బ్యాంకులతో పోల్చి చూస్తే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం 8.40 శాతం వడ్డీ రేటుకే బంగారం రుణాలను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం మారిన ఆర్బిఐ రూల్స్ ప్రకారం మీ బంగారంపై ఎక్కువ మొత్తంలో రుణం పొందే అవకాశం లభిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ సమాచారంగానే చూడాలి. ఎట్టి పరిస్థితులను ఆర్థిక సలహా స్వీకరించకూడదు. టైమ్స్ నౌ తెలుగు ఎలాంటి ఆర్థిక సలహాలు ఇవ్వదు.
తాజా వార్తలు
    Adithya author

    ఆదిత్య టైమ్స్ నౌ వార్తలు‌లో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. వీరు ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, లైఫ్ స్టైల్ అంశాల...మరిన్ని చూడండి

    ఆర్టికల్ ముగింపు