Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర...తులం బంగారం ధర రూ. 3000 తక్కువగా పలుకుతోంది...జూన్ 9, సోమవారం బంగారం ధరలు ఇవే...

బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. దీనికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు ఒక కారణం అని చెప్పవచ్చు. ప్రస్తుతం బంగారం ధర 97 వేల రూపాయల సమీపంలో ట్రేడ్ అవుతోంది. దేశీయంగా బంగారం ధరలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా మాత్రం వాణిజ్య ఉద్రిక్తతలు నెమ్మదిగా తగ్గుతున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మీరు ఆభరణాల షాపింగ్ చేస్తున్నట్లయితే ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

Gold Rate Today

Check gold's latest price in major Indian cities.

బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. జూన్ 9వ తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,960 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,790 పలికింది. ఒక కేజీ వెండి ధర రూ. 1,07,900 పలికింది. బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి కన్నా కూడా దాదాపు 3 వేల రూపాయలు తక్కువగా పలుకుతున్నాయి. బంగారం ధరలు గడిచిన మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు ఒక కారణమని చెప్పవచ్చు. బంగారం ధరలు అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లో తగ్గుదల బాట పడుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర 3300 డాలర్ల సమీపంలో ట్రేడ్ అవుతోంది. ఇది గతంలో 3500 డాలర్ల వద్ద ఆల్ టైం రికార్డును సృష్టించింది.
బంగారం ధరలు తగ్గడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఇక దేశీయంగా చూసినట్లయితే బంగారం డిమాండ్ తగ్గడం కూడా ధరలు తగ్గుదలకు ఒక కారణం అవుతోంది. ముఖ్యంగా బంగారం డిమాండ్ తగ్గడానికి పెళ్లిళ్ల సీజన్ ముగియడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. మరోవైపు అంతర్జాతీయంగా గమనించినట్లయితే స్టాక్ మార్కెట్లు పాజిటివ్ సిగ్నల్స్ చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం కన్నా కూడా స్టాక్ మార్కెట్ లోనే పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగా కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయి. బంగారం ధరలు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల ఆధారంగానే ఎక్కువగా కదలాడుతుంటాయి.
పసిడి ధరలు ఆల్ టైం రికార్డు స్థాయి నుంచి నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి. పసిడి ధరలు తగ్గడానికి మరో కారణం అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య యుద్ధం నెమ్మదిగా ఒక కొలిక్కి వస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలు దేశాలతో చర్చలు జరుపుతూ సుంకాల విషయంలో రాజీమార్గం కుదుర్చుకుంటున్నారు. ఇది కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక కారణం అవుతుంది అని చెప్పవచ్చు.
సాధారణంగా స్టాక్ మార్కెట్లో లాభాల బాటలో ఉన్నప్పుడు బంగారం ధర తగ్గుతుంది. దీనికి తోడు అమెరికా డాలర్ కూడా బలపడటం బంగారం ధరలు తగ్గడానికి ఒక కారణం అయిందని చెప్పవచ్చు. డాలర్ బలపడ్డప్పుడు కూడా బంగారం ధర తగ్గుతుంది. ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే డాలర్ విలువ పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెడుతుంటారు. ఈ కారణంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి.
తాజా వార్తలు
    Adithya author

    ఆదిత్య టైమ్స్ నౌ వార్తలు‌లో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. వీరు ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, లైఫ్ స్టైల్ అంశాల...మరిన్ని చూడండి

    ఆర్టికల్ ముగింపు